EPAPER
Thursday, August 20, 2026
Google search engine

విజయవంతంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 21:

 

కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శాంతిపురం మండల వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిం చినట్లు ఎంపీడీవో ఏపీఆర్ కుమార్ తెలిపారు. మండలం లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన114 కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా మొత్తం 13,432 మంది ప్రజలు యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. 340 మంది శిక్షకుల ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామ సిబ్బంది సమన్వయంతో యోగా సాధన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిం చామని చెప్పారు. యోగా కార్యక్రమాల్లో ప్రజలు,యువత, మహిళలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్యంపై తమ చైతన్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాల ని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో సహకరించిన మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు,మండల, గ్రామ స్థాయి అధికారులకు ఎంపీడీవో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన పెంచిన పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మండల వ్యాప్తంగా సమిష్టి సహకారంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా నిర్వహించబడిందని అధికారులు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!