EPAPER
Thursday, August 20, 2026
Google search engine

ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముగిసిన తిరుమల పాదయాత్ర

📰 Generate e-Paper Clip

 

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 21:

 

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం స్వగ్రామం ఊరందూరు నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరిన బొజ్జల రిషితా రెడ్డి విజయవంతంగా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దారి పొడుగునా గోవింద నామ స్మరణతో పాదయాత్ర మారుమోగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం,శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించడం కోసం ఎన్నికల ముందు మొక్కుకున్న మొక్కును ఆమె తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ,మహిళా నాయకులు,అభిమానులు,ఎన్డిఏ కూటమి,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి,పట్టుదల,సంకల్పబలానికి నిదర్శనంగా సాగిన ఈ పాదయాత్ర విజయవంతంగా ముగియగా,ప్రజలు రిషితా రెడ్డి దీక్షను అభినందించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!