
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 21:
యోగాకు మించిన ఔషధం లేదని కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. శంకర్ తెలిపారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగా శిక్షకురాలు డా. ఇన్య హాజరై విద్యార్థులకు యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది సంపూర్ణ జీవన విధానమని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక రుగ్మతలు దూరమవడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని వివరించారు. ప్రిన్సిపాల్ డా. బి. శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచే యోగా, ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెరుగుతాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఎల్.బి. ప్రదీప్ కుమార్ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల పెరుగుతున్న ఆదరణ భారతీయ సంస్కృతికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. సి. రాజ్యలక్ష్మి, అధ్యాపకులు డా. మాధవి, డా. ఏ. చంద్రబాబు, నమ్రతతో పాటు విద్యార్థులు పాల్గొని యోగా సాధన చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.


Recent Comments