EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ప్రజల విజ్ఞప్తితో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు కౌన్సిలర్ జిమ్ దాము

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 07:

 

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ప్యాలెస్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో చిన్న ఓం శక్తి ఆలయం సమీపంలో వాహనాల వేగం కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో స్థానిక కౌన్సిలర్ జిమ్ దాము దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రజల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కౌన్సిలర్ జిమ్ దాము సంబంధిత అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయించారు. ఆలయం సమీపంలో భక్తులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండటంతో వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరినట్లు సమాచారం. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు కావడంతో వాహనాల వేగం తగ్గి ప్రమాదాల అవకాశాలు తగ్గనున్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని కౌన్సిలర్ జిమ్ దాము తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!