EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ప్రభుత్వ ఆసుపత్రిలో మజ్జిగ పంపిణీ

📰 Generate e-Paper Clip

పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 02:

 

అన్నమయ్య జిల్లా పీలేరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీభగవాన్ సత్యసాయి భజనమండలి ఆధ్వర్యంలో మంగళవారం మజ్జిగపంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, వైద్యురాలు డాక్టర్ నాగవేణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన గర్భిణులు,బయటి రోగులు, ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు, అలాగే ఆసుపత్రి సిబ్బందికి కలిపి సుమారువెయ్యి మందికి శీతల పానీయమైన మజ్జిగను పంపిణీచేశారు. ఈ సందర్భం గా వైద్యులుమాట్లాడుతూ.. ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు మజ్జిగఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు. సేవా కార్యక్ర మాల ద్వారా మానవతా విలువలను చాటుతూ ప్రజలకు అండగా నిలవడం సత్యసాయి సంస్థల ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయి పీలేరు భజన మండలి కన్వీనర్ ఎస్. హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సేవాదళ్ సభ్యులు గురునాథ్,ఆనందాచారి,కె.వి.చెంగయ్య, ఉమామహేశ్,నరసింహులు,రమేష్, సర్వేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!