
గుడిపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 02:
కుప్పంనియోజకవర్గం గుడిపల్లి మండలంలో ద్రావిడ విశ్వవిద్యాలయం లో డిప్లమా ఇన్ యోగా కోర్సు పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉపకులపతి ఆచార్య ఎల్.సి. మల్లయ్య చొరవతో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు జూన్ 2 నుంచి జూన్ 6 వరకు కొనసాగ నున్నాయి. విశ్వవిద్యాలయ భాషా భవనంలో జరుగుతున్న ఈ పరీక్షలకు మొత్తం 12 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, తొలి రోజు 10 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతా వరణంలో సజావుగా ప్రారంభమైనట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. పరీక్షల నిర్వహణకు తులనాత్మక ద్రావిడ భాషల అధ్యయన పీఠం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అభ్యర్థుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను అందు బాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. లిఖిత పరీక్షలతో పాటు నిర్వహించనున్న ప్రాయోగిక పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో యోగా విద్యపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తోందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ విజయవంతంగా సాగేందుకు అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వివరాలను ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి డా.పి.ఎస్. గణేష్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.


Recent Comments