
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే30:
సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగాస్థానిక చేపల మార్కెట్ ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పారిశుధ్య కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చేపడుతు న్న చర్యలను అభినందించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పరిశుభ్రత ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతఅని పేర్కొన్నారు. ప్రజలుతమ ఇళ్లతో పాటు పరిసరప్రాంతాలను కూడా పరిశుభ్రంగాఉంచు కోవాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ కుండా నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని కోరారు. పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ పట్టణ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్,సుధాకర్ రెడ్డి, మేడ సాయి, కొండలరావు,వల్లం శంకరయ్య,పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Recent Comments