EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పేర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన  ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

📰 Generate e-Paper Clip

 

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 30:

 

 

తిరుపతిజిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గంలోని పేర్నాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే వైద్య సిబ్బంది సమయపాల న పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకు న్నారు. అలాగే ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై చర్చించారు.వైద్యంకోసం వచ్చిన రోగులతో కూడా ఎమ్మెల్యే మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సిబ్బంది వ్యవహార శైలి గురించి తెలుసుకున్నారు. ప్రజలు ఆసుపత్రికి వచ్చి నప్పుడు వారికి ఆత్మీయంగా సేవలు అందించాలని, రోగుల తో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…, వైద్యులు రోగులకు అందించే ధైర్యం, భరోసా కూడా చికిత్సలో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో నిల్వ ఉంచిన మందులను పరిశీలించిన ఎమ్మెల్యే, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఔషధాల నిల్వలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసంపెరిగేలా సేవలు అందించాలని,ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!