EPAPER
Thursday, August 20, 2026
Google search engine

వైభవంగా గంగమ్మ జాతర ప్రత్యేక పూజలు చేసిన  ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 19:

 

రేణిగుంట మండలం తారకరామ నగర్‌లో వెలసిన శ్రీపర్వతాల గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవం గా,భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. వేకువజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణ లు నిర్వహించి జాతర మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామస్తులు,మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సంప్రదాయ బద్ధంగా అంబలి సమర్పించారు. కాయలు, కర్పూరం, పండ్లు, పుష్పాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకు న్నారు. సాయంత్రం ఆలయప్రాంగణం లో మహిళలు పొంగళ్లు పెట్టి, అనంతరం కుంభం వేసే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదనంతరం గ్రామ వీధుల్లో అమ్మవారిని వైభవంగా ఊరేగిం చారు. మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో గ్రామస్తులు ప్రతి ఇంటి ముందర హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు అమ్మవారి కృపాకటాక్షాల కోసం భక్తి ప్రపత్తులతో జాతరలో పాల్గొన్నారు. జాతరకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి నాయుడు, లక్ష్మమ్మ, రామతులసి, జైచంద్ర, టైగర్ తదితరులు పాల్గొన్నారు. జాతర విజయవంతానికి సహకరించిన అందరికీ ఆలయ చైర్మన్ తమ్మిశెట్టి రవీంద్ర, కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!