EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్‌కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే09:

 

తిరుపతి–తిరుమల రెండురోజుల పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులకు అధికారులు ఘన స్వాగతం పలికారు.రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి,జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు,అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి,శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ఎమ్మార్వో శ్యామ్ ప్రసాద్ తదితర అధికారులు స్వాగతం పలికారు.తిరుపతి–తిరుమల పర్యటనలో భాగంగా గ్యానేష్ కుమార్ దంపతులు ఆలయ దర్శనం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!