
పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 30:
పదో తరగతి 2026 ఫలితాల్లో వి ఎస్ ఎన్ విద్యాసంస్థల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది విద్యాసంస్థల తరపున 294 మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో 291 మంది ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఫలితాలు నమోదు చేశారు. మార్కుల వారీగా పరిశీలిస్తే 590కు పైగా మార్కులు 11 మంది,580కు పైగా మార్కులు 36 మంది,550కు పైగా మార్కులు 102 మంది,500కు పైగా మార్కులు 182 మంది సాధించినట్లు వెల్లడించారు.విద్యార్థి వై హేమవర్దన్ 600లో 597 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానం పొందినట్లు తెలిపారు. విద్యార్థుల ఈ విజయంపై విద్యాసంస్థల అధినేత వడ్లమూడి మాధవి సంతోషం వ్యక్తం చేస్తూ, మరిన్ని ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.


Recent Comments