
భువనగిరి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 29:
ఆంజన్న స్వామీ జయంతి శుభ వేళ
భక్తుల హృదయాలు ఆనందంతో నిండిన వేళ…
నీ నామమే మా శ్వాసగా మారిన వేళ…
అంజనమ్మ గర్భాన జన్మించిన వీరుడా..!
సముద్రం దాటి సీతమ్మను చేరి
రామ సందేశం సీతమ్మ తల్లికి అందజేసి
లంకలో అగ్ని జ్వాలలు రగిలించి
రావణుడి గుండెల్లో గుబులు పుట్టించి
రాముని దూతగా వెలిగిన మహావీరుడా..!
లక్ష్మణ మూర్చతో రాముని హృదయం బాధతో నిండిన వేళ..
గగనాన్ని చీల్చి ఎగిరి సంజీవని పర్వతం
చేతబట్టి చేరి రాముని కళ్ళల్లో ఆనందం నింపిన
శ్రీరామ ధూత..!
నీ నామమే మా బలం, మా ఆశ్రయం,
రామ నామ ధ్యాన ప్రియ, కష్ట నివారకా,
మూగప్రాణాలను కాపాడు అభయదాతా..!
మంగళ ఘడియల సమయాన
మంజుల హృదయం నీ స్మరణతో నిండి
మంజుల కలంలో నుంచి జాలు వారిన కవిత కు
దీవెనలు తెలిపి మంజుల నుదుటిపై నీ కటాక్ష చాయ
కలిగించి ఆమె దారిలో మంగళం నింపుము దయాసాగరా..!
అందరికీ ఆనందాలు కలుగాలని వేడుకొంటూ
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.


Recent Comments