
గుడిపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 24:
కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామంలో పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్.ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత నియమాలు, మహిళలు మరియు పిల్లల రక్షణ, సైబర్ నేరాలు, ధైర్యస్పర్శ, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆన్లైన్ మోసాలు, పిల్లల రక్షణ చట్టం, బెట్టింగ్ వంటి అంశాలపై వివరంగా తెలియజేశారు. అలాగే పిల్లల భద్రత కోసం మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గ్రామస్థులు కార్యక్రమానికి స్పందిస్తూ పోలీసుల చర్యలను అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.


Recent Comments