EPAPER
Sunday, October 18, 2026
Google search engine

కర్తవ్యంతో పాటు కరుణ చూపిన  చిత్తూరు అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు వృద్ధురాలికి సాయం

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 24:

 

చిత్తూరు జిల్లాలో పోలీసులు మానవత్వానికి మరోసారి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 80 ఏళ్ల వయసులో కూడా కష్టపడి జీవనం సాగిస్తున్న వృద్ధురాలిని గుర్తించిన అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు సాయం అందించారు. వృద్ధురాలి పరిస్థితిని తెలుసుకున్న ఆయన ఆమెకు చీర అందజేసి, నివాస ఏర్పాట్లు చేయించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో పోలీసులు ముందుండాలని ఈ చర్య ద్వారా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధురాలి ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కర్తవ్యంతో పాటు కరుణ కూడా అవసరమని పోలీసు విభాగం మరోసారి చాటి చెప్పింది. స్థానిక ప్రజలు పోలీసుల సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!