EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పిల్లల భవిష్యత్ కు బలమైన పునాది వేయాలి  ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రైవేట్ కు మించి ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ జరగాలి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అవుతాం… ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 23:

 

పిల్లలబంగారు భవిష్యత్ కు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత విద్యాశాఖ పై ఉందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సూచించారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై డీఈవో రాజేంద్ర ప్రసాద్ తో పాటు మండల విద్యా శాఖాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెరగాల న్నారు.ఇందుకోసం ఇప్పటినుంచే ప్రణాళి కబద్దంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల మానసిక,శారీరక, సృజనాత్మక అభివృద్ధికి అనేక వినూత్న కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలియజేయాలన్నారు. మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాల ల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అందించ బడుతోందని అలాగే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం ఎన్‌సీసీ (ఎన్ సి సి),ఎన్‌ఎస్‌ఎస్‌ (ఎన్ ఎస్ఎస్), స్కౌట్స్& గైడ్స్ కార్యక్రమాలు నిర్వహించ బడుతున్న అంశాలను తెలిజెప్పాలన్నా రు. ప్రైవేట్ పాఠశాలలకు మించి విద్యార్థుల రక్షణ,ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు కరాటే శిక్షణ, సంగీత బోధన, శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు ప్రయోగశాల (ల్యాబ్) సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రతిపాఠశాలలో డిజిటల్ బోధన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే బోధన,వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, క్రీడలు,సహపాఠ్య కార్యకలాపాలు విజ యవంతంగా నిర్వహించబడుతున్నా విషయాలను ఇంటింటికి చేరవేయాల న్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల ల్లోని ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తమ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో తాము భాగస్వామిలవు తామని ఆయన వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి, చిత్తూరు ఎస్ ఎస్ ఏ సెక్టోరియల్ ఆఫీసర్ మోహన్ సింగ్ లతో పాటు ఎమ్మార్శి సిబ్బంది ఉన్నారు. నియోజక వర్గంలోని అన్ని ప్రాథమిక,ఉన్నత పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కి చేపడుతున్న కార్యక్రమాలు,విద్యా ప్రమాణాలు,భౌతిక–మానసిక వికాసాని కి సంబంధించిన అంశాలను సమగ్రంగా క్రోడీకరించి అవసరమైతే ప్రతిపాఠశాలకు వేరువేరుగా కరపత్రాలను సిద్ధం చేసుకో వాలని తెలియజేశారు. చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో ఎంఈ ఓలు లీలారాణి, బాలసుందరం పాల్గొన గా,మండలంలోని అన్నిప్రాథమిక,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు హాజరయ్యారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!