EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

నాటు సారా తయారీదారులపై కుప్పం డీఎస్పీ దాడి – ముగ్గురు అరెస్ట్

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 22:

 

అక్రమంగా నాటు సారా తయారీ చేస్తున్న వారిపై కుప్పం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డిఎస్పి పార్థసారధి తెలిపారు. గత అర్ధరాత్రి అందిన విశ్వసనీయ సమాచారంపై డీఎస్పీ స్వయంగా తన సిబ్బందితో కలిసి మండలంలోని బలమంద కొట్టాలు గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లక్ష్మిపతి, రఘుపతి, కృష్ణప్పలు తమ సొంత వ్యవసాయ భూమిలో నాటు సారా తయారు చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్నట్లు వెళ్లడయ్యిందన్నారు. సంఘటన స్థలంలో నాటు సారా తయారీకి ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిఎస్పి హెచ్చరించారు. అక్రమ మైనింగ్, ఇసుక రవాణా, గాంజా వినియోగం, విక్రయం, నాటు సారా తయారీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలని ప్రజలను కోరిన డీఎస్పీ సమాచారం ఇచ్చే వ్యక్తులు ఫోన్ నంబర్ 9346010144, కుప్పం టౌన్ సీఐ 9440900733, రూరల్ సీఐ 9440796737 నంబర్లకు 24 గంటలూ సంప్రదించవచ్చని తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!