
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు,సమగ్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు-76వ పుట్టినరోజు సందర్భంగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న దూరదృష్టి కలిగిన నాయకుడు అని కొనియాడారు. ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు-సాగిందని, భవిష్యత్తులో కూడా ప్రజల ఆశలను నెరవేర్చేలా సేవలు-కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రేయస్సు చేకూరాలని, చంద్రబాబు నాయుడికి ఆయురారోగ్యాలు కలగాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో ప్రత్యేక హోమాలు, అర్చనలు• నిర్వహించి రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కొనసాగాలని కోరుకున్నారు. ఈ వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం నిండా భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమం అనంతరం భక్తులకు-ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పాల్గొన్న నాయకులు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు మరింత శక్తి, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.


Recent Comments