EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు నిండు నూరేళ్లు జీవించాలి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి నాయుడు 

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

శ్రీకాళహస్తిలో మాజీ శాసనసభ్యులు ఎస్.సి.వి నాయుడు స్వగృహం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి మాజీ శాసనసభ్యులు ఎస్.సి.వి నాయుడు సారథ్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన కేకును ఎస్.సి.వి నాయుడు కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, టిడిపి జిందాబాద్, మంత్రి నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్.సి.వి నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఏపీని అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పదంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర శ్రామికుడిగా చేస్తున్న కృషి ఎనలేనిదని రాష్ట్ర అభ్యున్నతికి, సమాజంలో పేదరికం నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు చంద్రబాబు దార్శినీకత ను చాటుతున్నాయి అన్నారు. అలాంటి మహా నాయకుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నూరు నిండేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తిశ్వరుని ఆశీస్సులతో పాటు జీసస్, అల్లా సకల దేవతల దీవెనలు లభించాలని ఎస్.సి.వి నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!