EPAPER
Saturday, April 18, 2026
Google search engine

అంబేద్కర్ జయంతి సందర్భంగా వినూత్న నివాళి

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:

 

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కుప్పం పట్టణంలో ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని కొత్తపేట జయప్రకాశ్ రోడ్డులో నివాసం ఉంటున్న శ్యామల, కృష్ణంరాజు దంపతుల కుమారుడు తారక్ వంశీ రాజు ప్రత్యేకంగా అంబేద్కర్ చిత్రపటాన్ని స్వయంగా చిత్రించి ఆయనకు వినూత్నంగా నివాళులు అర్పించారు. తారక్ వంశీ రాజు తన చిత్రకళా నైపుణ్యంతో అంబేద్కర్ చిత్రాన్ని ఆకర్షణీయంగా రూపొందించగా, స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకారుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన ఆలోచనలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని, ఆయన ఆలోచనలను తమ కుమారుడు చిన్న వయస్సు లోనే గుర్తించి, ఆయన పై అభిమానం చూపడం ఆనందంగా ఉందన్నారు.

 

 

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!