
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 04:
స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో భాగంగా శనివారం గాంధీ విగ్రహ కూడలి వద్ద జీరో వేస్ట్, తడి, పొడి వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, మనోహరం, ప్రతిజ్ఞా కార్యక్రమాలు జరిగాయి. ప్రజల భాగస్వామ్యంతోనే చిత్తూరు నగరాన్ని వ్యర్థరహితంగా మార్చుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ తెలిపారు. తడి, పొడి వ్యర్థాల వేరుపరచడంపై గ్రీన్, బ్లూ, రెడ్ డస్ట్ బిన్లతో అవగాహన కల్పించారు. ఈ రంగుల సూచనలను కాన్వాస్లపై ప్రదర్శించి వివరించారు. జీరో వేస్ట్పై రూపొందించిన రంగవల్లి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ‘స్వచ్ఛత యాప్’ డౌన్లోడ్ చేసుకొని వాడాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డా.పి.లోకేష్,సానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు,మేస్త్రీలు, ప్రజలు పాల్గొన్నారు.


Recent Comments