EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కుప్పం న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 30:

 

కుప్పం న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో సభ్యుల మెజారిటీ ఆమోదంతో రాబోయే రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా వి.ఎస్. శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా సిద్ధవటం నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా కె. ఉదయ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా కె.వి. వాసు బాధ్యతలు చేపట్టారు. కోశాధికారిగా జి. పుష్పలత, సంయుక్త కోశాధికారిగా పి.ఆర్. వివేక్ లను ఎన్నుకున్నట్టు తెలిపారు. గ్రంథాలయ కార్యదర్శిగా ఏ.ఆర్. ధనశేఖర్, సంయుక్త గ్రంథాలయ కార్యదర్శిగా ఈ. పళని, క్రీడా కార్యదర్శిగా ఆర్. అనిల్ కుమార్, సంయుక్త క్రీడా కార్యదర్శిగా వి. జలపతి ఎన్నిక కాగా, మహిళా కార్యదర్శిగా వి.ఎస్. శైలశ్రీ, సంయుక్త మహిళా కార్యదర్శిగా కె. చందన ప్రియ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని నూతన కార్యవర్గానికి తమ మద్దతు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!