చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 20 :
చిత్తూరు ఆర్టీసీ బస్ స్టేషన్ నందు దివ్యాంగ శక్తి పథకంలో ఆర్టీసీ ఫ్రీ పాసుల కొరకు చిత్తూరు ఆర్టీసీ బస్ స్టేషన్కు వచ్చేటువంటి దివ్యాంగుల సౌకర్యార్థం దివ్యాంగులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా సలహాలు సూచనల కొరకు డిపో మేనేజర్ గారి సహకారంతో దివ్యాంగ సంఘాల జేఏసీ నాయకుల కోరిక మేరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, ఆర్టీసీ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది. దివ్యాంగులు ఆర్టీసీ పాసుల కొరకు చిత్తూరు ఆర్టీసి బస్ స్టేషన్కు రాదలచినవారు, రాలేనటువంటి దివ్యాంగులు వారి సహాయకులుగా ఎవరినైనా డిపో వద్దకు పంపించవచ్చు దివ్యాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఫోటో ఇచ్చి పంపితే చాలు. వారికి వెంటనే ఆర్టీసీ పాస్ చేయించి పంపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చిత్తూరు టు డిపో పరిధిలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.


Recent Comments