వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి13:
వి.కోట మండలం. చింతలయల్లాగరం ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్స వము,పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి విజయ అధ్యక్షతన జరిగింది. ముందుగా తన సందేశం లో పదవతరగతి విద్యార్థులకు మంచి మార్కులు మాత్రమే కాదు.మంచి నడవడిక కూడా అలవడాలి. మీ తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మీరు ఉన్నత దశకు చేరుకోవాలి అని, ఆదర్శ వంతమైన దేశ పౌరులుగా ఎదగాలని కోరారు. అతిధులు తమ సందేశం లో పిల్లల భవిత కై మన ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వాటిని ప్రతి విద్యార్థి, వారి తల్లి దండ్రులు సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేయాలని కోరారు. మరి కొందరు తమ తమ సందేశాలను పిల్లలకు తెలియజేసారు. అనంతరం పిల్లలు చే సాంస్కృ తిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి.ఈ కార్యక్రమం లో పాఠశాల కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యాయులు చంద్ర శేఖర్, గజేంద్ర, మధుసూదన్ రెడ్డి, ఇర్ఫాన్, భారతి, సాలమ్మ, ఉషారాణి, శివరాజన్. కొఠారి వెంకటరత్నం. జీవీ రమణ, జనార్దన్ రెడ్డి. ప్రవీణ్ కుమార్ రెడ్డి. రమేష్ సి ర్ పి.విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లి తండ్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Recent Comments