EPAPER
Sunday, October 18, 2026
Google search engine

పంచాయతీలో త్రాగునీరు ట్యాంకులకు క్లోరేషన్

📰 Generate e-Paper Clip

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 13:

 

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్ళపల్లి గ్రామ పంచాయతీలో త్రాగునీరు సురక్షితంగా అందేలా వాటర్ ట్యాంకులకు క్లోరేషన్ టాబ్లెట్లు వేయడం జరిగింది. స్థానిక సర్పంచ్ బండి శశి ఆనంద రెడ్డి సెక్రటరీ ధనంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.ఈ చర్య గ్రామస్థులకు, ఆరోగ్యకరమైన త్రాగునీరు అందించడానికి ఉద్దేశించబడింది. వేసవి ఆలస్యంతో ట్యాంకుల్లో నీటి కలుషితం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్పంచ్ శశి ఆనంద రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. “గ్రామస్థుల ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యత. క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేస్తూ నీటి నాణ్యతను కాపాడుకుంటాం” అని సర్పంచ్ చెప్పారు.పంచాయతీ సెక్రటరీ ధనంజయ్ మార్గదర్శకత్వంలో సిబ్బంది. అన్ని ట్యాంకుల్లో టాబ్లెట్లు వేసి, నీటి స్థాయిలు పరీక్షించారు. గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని స్వాగతించి,స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!