శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి13:
ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతన్నలకు అందజేస్తామని ప్రకటించిన ప్రతిష్టాత్మక “అన్నదాత సుఖీభవ” మూడో విడత కార్యక్రమం సందర్భంగా శాంతిపురం మండలంలో శుక్రవారం రైతులతో సమావేశం లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్యక్రమం ద్వారా శాంతిపురం మండలానికి చెందిన 36,473 మంది రైతులకు సుమారు రూ.19.76 కోట్లు మూడో విడత లో భాగంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే 1,2,3 విడతలు లో భాగంగా మొత్తం 36,473 మంది రైతులకు మొత్తం 67.49 కోట్లు జమ చేశారు. అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ.20,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ సహాయం కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పీఎం కిసాన్) పథకంతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతోంది. రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రభుత్వం నమ్ముతుంది అని రైతులకు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం పి కే ఎం ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, కడ పీడి వికాస్ మరమ్మత్, మండల తెదేపా అధ్యక్షుడు నందిగం ఉదయ్ కుమార్, ఏఎంసి డైరెక్టర్లు, రెస్కో డైరెక్టర్లు, తెదేపా, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Recent Comments