EPAPER
Wednesday, March 11, 2026
Google search engine

కుప్పంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి08:

 

కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కుప్పం ఎం.ఎఫ్.సి ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షుడు పి.ఎస్. మునిరత్నం, పి.కె.ఎం పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల కోసం మ్యూజికల్ చెయర్స్ వంటి పలు క్రీడా పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన ఉత్తమ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాజెక్టు డైరెక్టర్ అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. మహిళా సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్రంటియర్ మార్కెట్, మైన్ మహిళ, పురే, ఎజిమార్ట్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను అతిథులు సందర్శించి మహిళా వ్యాపారులను ప్రోత్సహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!