EPAPER
Sunday, March 8, 2026
Google search engine

చిత్తూరు జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం కేంద్రం ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి07:

 

వేసవి కాలంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో చిత్తూరు ట్రాఫిక్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు శనివారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…, పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలకు చల్లని త్రాగునీరు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పోలీసు సుజల వాటర్ ప్లాంట్ నుండి శుద్ధి చేసిన త్రాగునీటిని ఈ చలివేంద్రం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో పనిచేస్తున్న ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు, పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!