EPAPER
Sunday, March 8, 2026
Google search engine

జిల్లా సాయుధ దళం కార్యాలయం వెలుపల చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన  జిల్లా ఎస్పీ తుషార్ డూడి,ఐపిఎస్ 

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి:

 

వేసవి కాలంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయం వెలుపల ఏ.ఆర్. పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపిఎస్ గురువారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలకు చల్లని నీరు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పోలీసు సుజల వాటర్ ప్లాంట్ నుండి శుద్ధి చేసిన త్రాగునీటిని ఈ చలివేంద్రం ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు, పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. దేవదాస్, ఏ.ఆర్. డి.ఎస్పీ చిన్ని కృష్ణ, ఎస్.బి. ఇన్స్పెక్టర్ మురళీమోహన్, మహిళా ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు, ఆర్.ఐ.లు సుధాకర్, చంద్రశేఖర్, ఆర్.ఎస్పీ.లు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!