కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 04:
కుప్పం పట్టణలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. అమ్మవారి భక్తాదు లు హుండీలో సమర్పించిన కనుల ద్వారా నగదు35,96,260 రూపాయలు, బంగారు 110 గ్రాములు, వెండి 721 గ్రాములు ఆదాయం వచ్చి నట్టు ఆలయ కమిటీ చైర్మన్ బీఎంకె రవి చంద్రబాబు, ట్రస్ట్ బోర్డుసభ్యులు తెలిపా రు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… త్వరలో అమ్మవారి జాతర జరుగుతున్న సందర్బంగా హుండీ లెక్కింపు చేపట్టడం జరిగిందన్నారు. గత 9 నెలలుగా అమ్మ వారి భక్తాదులు పెద్దమొతంలో కానుకలు సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్య క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments