కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 03:
కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో ముస్లిం మైనారిటీ సోదరులు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక నాయకుల సమక్షంలో ఉత్సాహభరితంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చేరిక కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీఎంకేఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్.డి. సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన ముస్లిం మైనారిటీ సోదరులకు పసుపు కండువాలు కప్పి పార్టీ లోనికి ఆహ్వానించారు. కొత్తపేటకు చెందిన నజీర్ ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, ముస్లిం పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం సాధనలో పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తపేట ప్రాంతంలో జరిగిన ఈ చేరికలు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతాయని అభిప్రాయపడ్డారు. కొత్తపేటలో ముస్లిం మైనారిటీల భారీ చేరికతో పట్టణ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, 11వ క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్, కొత్తపేట యూనిట్ ఇంచార్జి ముఖేష్ అప్పు, మాజీ ఎంపీటీసీ కృష్ణన్, సోమశేఖర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము, గాజుల గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్, మంజునాథ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments