EPAPER
Wednesday, March 11, 2026
Google search engine

యువత భవిష్యత్తును కాపాడుకుందాం… డ్రగ్స్‌కు దూరంగా ఉందాం 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 26:

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ అనే మహమ్మారిపై గట్టిగా గళమెత్తుతూ కుప్పం మండలంలోని పొన్నాంగూరు జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం రూరల్ ఎస్సై రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటి వల్ల కలిగే ప్రమాదాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ, డ్రగ్స్ వైపు ఒక్క అడుగు వేస్తే అది జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబ గౌరవం కోల్పోయే పరిస్థితులు వస్తాయని, చట్టపరమైన కఠిన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. “ఒక్క తప్పు నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. బాధ్యత లేకుండా గడిపే సమయం భవిష్యత్తును మసకబారుస్తుందని, కానీ పట్టుదలతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. తల్లిదండ్రుల ఆశలు, కలలను నెరవేర్చే బాధ్యత విద్యార్థులపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అతిథులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా “డ్రగ్స్‌కు నో చెప్పాలి – చదువుకు యెస్ చెప్పాలి” అనే సందేశం బలంగా వినిపించింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!