EPAPER
Wednesday, March 11, 2026
Google search engine

విద్యార్థుల్లో చైతన్యం నింపిన రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ కొడతనపల్లి జడ్‌పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి26:

విద్యార్థుల్లో ధైర్యం,క్రమశిక్షణతో పాటు సామాజిక బాధ్యతాభావాన్ని పెంపొందిం చాలనే లక్ష్యంతో కుప్పం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ యాదవ్ తన పోలీసు సిబ్బందితో కలిసి గుడిపల్లి మండలం కొడతనపల్లి జడ్‌పీ హెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించారు.పాఠశాలలో నిర్వహిం చిన వార్షికోత్సవకార్యక్రమం సందర్భంగా ప్రత్యేక అవగాహ న సదస్సును నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ యాదవ్ విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతో పాటు మంచి విలువలు అలవరుచు కుంటేనే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకో వచ్చని సూచించారు. చిన్న వయస్సులో నే ధైర్యం, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు.బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, వాటి వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుం దని వివరించారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణ యించుకుని పట్టుదలతో చదువుకుంటే విజయం సాధించవచ్చనిప్రేరణ నిచ్చారు. ముఖ్యంగా బాలికల భద్రత దృష్ట్యా “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్”పై అవగాహన కల్పిస్తూ, ఏవైనా అనుమానాస్ప ద పరిస్థి తులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాల ని సూచించారు. డ్రగ్స్ వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తుందని హెచ్చరిస్తూ,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే పెరుగు తున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని,సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధ నలు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీసులు అందించిన సూచనలు విద్యార్థుల్లో మంచి స్పందనను కలిగించాయి.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!