శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:
శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనా నికి విచ్చేశారు. విచ్చేసిన వారిని దేవస్థానంకార్యనిర్వహణా ధికారి టి.బాపిరెడ్డి దక్షిణ గాలిగోపురంవద్ద స్వాగతం పలికా రు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనంఏర్పాటు చేశారు.మృత్యుంజయస్వామి సన్నిధానంవద్ద ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.బాపిరెడ్డి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శేషవస్త్రంతో సత్కరించి వేదపండి తులచే ఆశీర్వదించి స్వామి అమ్మ వార్ల చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణాధికారి టి.బాపిరెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు సతీమణి రిషితా రెడ్డి,ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, సభ్యులు గుర్రప్ప శెట్టి,గోపీనాథ్, కౌసల్యమ్మ, సావిత్రి, లక్ష్మమ్మ,ప్రత్యేక ఆహ్వానితులు వెంకట్రామ నాయుడు, ఆలయ అధికారులు , స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Recent Comments