EPAPER
Sunday, March 8, 2026
Google search engine

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ 

📰 Generate e-Paper Clip

పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:

 

అన్నమయ్యజిల్లా పీలేరు రాష్ట్రంలోని అనంతపురం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాల యాలపై జరిగిన దాడులను ఎన్‌.ఎస్‌.యు‌.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల. అమృత్ తేజ ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడులేనని పేర్కొన్నారు. అధికార అహంకారంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిం చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపౌరుడి రాజ్యాంగహక్కు అని,ఆ హక్కును అణచి వేయడానికి దాడులు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!