EPAPER
Friday, February 20, 2026
Google search engine

పోలీసులు విద్యాశ్రం పాఠశాలలో విద్యార్థులకు భద్రతా చట్టాలపై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 20:

ధైర్య స్పర్శ, మంచి తప్పు తాకుడు, బాల్యవివాహ నిరోధక చట్టం,సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకం నష్టాలు,పోక్సో చట్టం,హెల్ప్‌లైన్ నంబర్లు,శక్తి యాప్ ప్రాముఖ్యతపై చిత్తూరుజిల్లా మహిళా పోలీసులు విద్యాశ్రం పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు శక్తిటీం నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మహిళా స్టేషన్ పరిఘటనా ధికారి కరీమునిస్సా,ఏఎస్‌ఐ వెంకటేశులు సదస్సునిర్వహిం చారు. మంచి చెడు తాకుడు గుర్తింపుమహిళా పోలీస్ స్టేషన్ పరిఘటనాధికారి మాట్లాడుతూ.. భవిష్యత్తు పౌరు లైన విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి చెడు తెలుసుకో వాలని, అనవసర తాకుడు అసౌకర్యం కలిగిస్తే వెంటనే నో చెప్పి గురువు, తల్లిదండ్రులు లేదా పోలీసులకు తెలియజే యాలని సూచించారు.బాల్యవివాహ ప్రమాదాలు బాల్య వివాహం పెద్ద సమస్య అని,బాలికలు 18సంవత్సరాలు పూర్తి కాకముందే పెళ్లి చట్టవిరుద్ధమని,చదువు ఆగిపోవడం,ఆరోగ్య సమస్యలు,భవిష్యత్తు దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు.చదువులోముందు కు వెళ్లి జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. పోక్సో చట్టం కఠినతపోక్సో చట్టం చాలా కఠినమైనదని, 18సంవత్సరాలలోపు పిల్లలపై లైంగికవేధింపులుదాడులకు కఠిన శిక్షలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. హెల్ప్‌లైన్ నంబర్లుఅత్యవసరాల్లో 112 ఎమర్జెన్సీ నంబర్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ గుర్తుంచుకోవాలని,ఇవి వెంటనే సహా యం చేరుస్తాయని సూచించారు.ధైర్య స్పర్శ కార్యక్రమం ఎస్పీ ప్రారంభించిన ధైర్య స్పర్శ కార్యక్రమం భయంకలిగించే ప్రాంతాలు,అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే ప్రదే శాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలుగామార్చడం లక్ష్యమని, అటువంటి చోట్ల సమాచారం ఇవ్వాలని,ధైర్య స్పర్శ భయా నికి ముగింపు భద్రతకు ఆరంభం అని పేర్కొన్నారు. శక్తి యాప్ ఉపయోగంబాలికలకు ప్రభుత్హ శక్తి యాప్ చాలా ఉపయోగకరమని, ప్రమాదాల్లో యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని,ఒకే ఎస్ఓఎస్ బటన్ ప్రెస్‌తో సమీప స్టేషన్‌కు వివరాలు చేరుతాయని వివరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం, అత్యవసర సేవలకు మేలైన సాధనమని అన్నారు.సైబర్ నేరాలు డ్రగ్స్ నష్టాలుసైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకం వల్ల రోడ్డు ప్రమాదాలు వచ్చే నష్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!