EPAPER
Friday, February 20, 2026
Google search engine

ఆర్తులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు సీఎంఆర్ఏఫ్ చెక్కులను అందజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

📰 Generate e-Paper Clip

 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 17:

ముఖ్యమంత్రి సహాయనిధి హార్తులకు ఆపన్నహస్తాన్ని అందిస్తూ..,వారి పాలిట పెన్నిధిగా పని చేస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడా రు. అన్నార్తులవిషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చొరవఅభినందనీ యమన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 2,88,348 రూపాయల విలువైన చెక్కులను,చిత్తూరు ఎంపీ కార్యాల యంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు బాధిత కుటుంబాలకు అందించి, వారిలో ఆత్మస్థైర్యా న్ని నింపారు. కష్టాల కడలిలో ఉన్నఆర్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాల పట్ల చూపుతున్న చొరవ స్పూర్తిదాయ కమని ప్రశంసించారు. సియం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!