EPAPER
Friday, February 20, 2026
Google search engine

“మహత్యం కాదు… శాస్త్రమే సత్యం” – రెయిన్బో స్కూల్‌లో సైంటిఫిక్ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

రేణిగుంట, చిత్తూరు ఎక్సప్రెస్,ఫిబ్రవరి 14 :

రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెవివి స్టేట్ కన్వీనర్ బాలబాయన్న “సైంటిఫిక్ మ్యాజిక్” కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులకు వివిధ కెమికల్ రియాక్షన్స్,ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ను ఆసక్తికరంగా ప్రదర్శించారు.శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని సాధారణ ప్రజలను ఎలా మోసం చేస్తారో వివరించి, అలాంటి ఘటనలను మహత్యంగా కాకుండా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని సూచించారు. సమాజంలో శాస్త్రీయ చైతన్యం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ పి అత్తా ఉల్లా ఖాన్ మాట్లాడుతూ,నేటి విద్యార్థులే రేపటి భారత పౌరులని,యువతను శాస్త్రీయంగా మరియు సాంకేతికంగా బలపరిస్తేనే ఉజ్వల భారతదేశాన్ని నిర్మించగలమని అన్నారు.రెయిన్బో స్కూల్‌లో విద్యతో పాటు సైంటిఫిక్ నాలెడ్జ్ పెంపొందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని,ఇప్పటికే సైంటిస్టులను తయారు చేసిన ఘనత తమ స్కూల్‌కు ఉందని, భవిష్యత్తులో మరింత మందిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!