EPAPER
Friday, February 20, 2026
Google search engine

శీర్షిక మహాశివరాత్రి

📰 Generate e-Paper Clip

భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 14:

మునిజనంబులు, దేవగణంబులు పొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట విభూతి ధరించి నిరాడంబరంగా నిష్కల్మషంగా బతకడంలో అర్ధం, పరామార్ధముందని గ్రహించి నడవాలిని చెప్పకనే చెప్పిన మోక్ష పద్రాత..!స్త్రీశక్తివిశిష్టతను తెలియచెప్పేందుకు అర్ధనారీశ్వర రూపంలో అవతరించి ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, ఒకటిగా చెరిసగముగా ఉండాలని చెప్పిన ఓ వరపద్రాత..!పప్రంచ మేలు కోసము కాలకూటం విషాన్ని గళంలో దాచిన గరళ కంఠుడా..! మంగళానికే మంగళకరుడైన దేవ అందుకో అందుకో మా వందనాలు..! దివి నుండిపెద్దశబ్దం చేసుకుంటూ వస్తున్న గంగమ్మను పుడమి ముక్కలు కాకుండా జటాజూటాల నుండి భువికి దింపిన గంగాధర..!మంగళానికే మంగళకరుడైన దేవ అందుకో అందుకో మా మంగళహారతులు..! లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన శివుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ..మహాశివరాత్రి శుభాకాంక్షలు 2026 శ్రీమతి మంజుల పత్తిపాటి(కవయిత్రి) మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చరవాణి 9347042218

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!