పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి11:
చిత్తూరుజిల్లా పలమనేరుమండలం మొరంపంచాయతీ రాజీవ్ నగర్ కాలనీలో గత 15రోజులుగా వీధి లైట్లు వెలగక పోవడంతో స్థానికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ)కి ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకో లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వీధులన్నీ అంధకారంగా ఉండటంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాలనీ శివారు ప్రాంతం కావడంతో చీకటిలో పాములు, ఇతర విషకీటకాలు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో తెలియక ప్రాణభయంతో గడుపుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పక్షంరోజులు గడుస్తున్నా, కనీసం మరమ్మతులు చేసేందుకు కూడా ఎవరూ రాకపో వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మేము 15 రోజుల క్రితమే సెక్రటరీ గారికి మొరపెట్టుకున్నాం. కానీ పరిస్థితిలో మార్పు లేదు. పిల్లలు, వృద్ధులు రాత్రిపూట బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఇక నేడు కూడా ఈ సమస్య తీరకపోతే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.


Recent Comments