EPAPER
Friday, February 20, 2026
Google search engine

వైభవంగా వీ.కోటలో అంజని పుత్రుని పుష్ప పల్లకి సేవ ఆలయం వద్ద బారులు.. తీరిన భక్తులు.  

📰 Generate e-Paper Clip

వీ.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి11:

వీ.కోట పట్టణంలో వెలసియుండు శ్రీవీరాంజనేయస్వామి 59వ పుష్ప పల్లకి సేవ ఉత్సవానికి వీకోట పట్టణంలో విశేష మైన విద్యుత్ దీపాలంకరణతో తిరుమల అని తలపించే విధంగా తీర్చిదిద్దినారు. వి.కోటపట్టణం భక్తులతో  సందర్శ కులతో పోటెత్తినది.వీకోట బజారుమార్గం,పరస నిర్వహించే వేణుగోపాల స్వామిగుడి వీధులలో దుకాణాలతో, సందర్శ కులతో కిటకిటలాడుతున్నది. ఆలయంకు విచ్చేసే భక్తుల కోసం అన్న ప్రసాదాలను అత్యధికంగా సిద్ధం చేసినారు. వీరాంజనేయస్వామి వీ.కోటపట్టణ పురవీధులలో ఊరేగిం చడానికి కనులవిందైన భారీ పూల పల్లకిని సిద్ధం చేసినారు. స్వామివారిని ఊరేగింపు సందర్భంగా వైద్య బృందం డప్పు ల బృందం కోలాటాలు పండరి భజనలు రామ భజనలు బుట్ట బొమ్మలు సిద్ధం చేసినారు. పుష్ప పల్లకి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీకోట పట్టణ సిఐ సోమశేఖర్ రెడ్డి తమ పరివారంతో గట్టి బందో బస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఆలయంవద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్వహణ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!