గంగవరం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి13:
దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా సుభిక్షంగా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకునే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ మూడో విడత నేతల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…. సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 పిఎం కిసాన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా 6000 కలిపి ఏడాదికి 20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతలలో రైతులకు ఈ నిధులను జమ చేయడం జరిగిందని మూడో విడతలో భాగంగా నియోజకవర్గంలోని 38,368 మంది రైతులకు 21.71 కోట్లను జమ చేస్తుండడం ఆనందదాయకమన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలను గ్లోబల్ ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాయలసీమ హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ పథకం కింద 30 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నామని వివరించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఎనిమిది లక్షల నుంచి 14 లక్షల హెక్టార్లకు రాబోయే మూడేళ్లలో సంవత్సరానికి రెండు లక్షల హెక్టార్ల చొప్పున పెంచడమే గాక ఉద్యాన పంటల ఉత్పత్తిని 2.21 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4.25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం వల్ల రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఇక కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అన్ని కార్యక్రమాలను అమలు చేయడమే గాక 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలను ఉద్యాన రైతులకు రాయితీలు,ప్రకృతి వ్యవసాయనికి ప్రోత్సాహకం, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి రైతులకు ప్రోత్సాహం, పంటల సాగులో ఏఐ డిజిటల్ సేవలు వంటి కార్యక్రమాలతో రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. వీటితోపాటు రైతులకు రవాణా మరియు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సాగుకి అవసరమైన అన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. రాబోవు రోజుల్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని పూర్తిస్థాయిలో 100కు 100 శాతం అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో గంగవరం, బైరెడ్డిపల్లి, పలమనేరు, పెద్దపంజాణి, మండలాల ఏవోలు రఖీభా, గీతా, సంధ్య, హేమలత, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మండల నాయకులు సోమశేఖర్ గౌడ్,ప్రతాపరెడ్డి, ప్రసాద్ నాయుడు, బత్తి గౌడు, వెంకట మునిరెడ్డి,నాగరాజు, ఆర్.బి.సి కుట్టి, హరిబాబు, రవి, సురేష్,లతో పాటు జనసేన నాయకులు దిలీప్ కుమార్,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Recent Comments