EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

20 న అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆల్  ఇండియా సమ్మె 20న మెడికల్ షాపులు బంద్

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే16:

 

శ్రీకాళహస్తి ఈ ఫార్మసీ ద్వారా ఆన్లైన్లో వివిధ రకాల మందులను ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందజేయడం ద్వారా మెడికల్ షాపులు పెట్టుకున్న దాదాపు 12,40,000 మంది జీవనాధారం కోల్పోతున్నారని. ఈ ఆన్లైన్ విధానాన్ని కొనసాగించవద్దంటూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ రాత్రి 12 నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా పూర్తిగా మెడికల్ దుకాణాలు మూసివేసి సమ్మె చేస్తున్నట్లు శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ సభ్యులు శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని గంజాయి రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో అనేక ఈగల్ టీమ్ లను ఏర్పాటు చేసి ఎక్కడికి అక్కడ మత్తు పదార్థాలను కుకటి వేళ్ళతో తీసివేస్తున్న, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ఈ ఫార్మసీ ద్వారా ఆన్లైన్ లో మందులను విక్రయించేందుకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసంమంటు, వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఫార్మసీ ఆన్లైన్ ద్వారా మత్తు పదార్థాలు కూడా ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా వ్యక్తులకు అందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ,ఇలాంటి ఆన్లైన్ సేవలను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆన్లైన్ విధానాన్ని ఇదేవిధంగా కొనసాగిస్తే ఈనెల 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ లను పూర్తిగా బంద్ చేసి సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో అత్యవసరంగా మెడిసిన్ కావాల్సినవారు ఈ కింద నెంబర్లను సంప్రదిస్తే మధుసూదన్ రావు 9985251463, గోపాల్ 7893266266 అత్యవసరం మందులను అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ దేశవ్యాప్త బందుకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మన మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి కొండేటి గోపాల్ ,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహులు నంద , మాజీ ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, ఉపాధ్యక్షులు కొండేటి చక్రపాణి, చిన్నారావు, మహేందర్రెడ్డి, మోనిష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!