EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

స్వయం సమృద్ధి గల మహిళల ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం 

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 17:

 

శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు గత 40 రోజుల నుంచి పీఎం ఉష సాఫ్ట్ కాంపోనెంట్స్ భాగంగా స్వయం సమృద్ధి గల మహిళల ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది. మంగళవారం రోజు జరిగిన బెల్ట్ పరీక్షలో అద్భుతమైన ప్రదర్శన చూపిన ఇద్దరు విద్యార్థినులకు గ్రీన్ బెల్ట్ లు తదుపరి ఎనిమిది మంది విద్యార్థినులకు ఆరెంజ్ బెల్ట్ లు , మిగిలిన వారికి పసుపు బెల్ట్ లు మరియు ప్రశంస పత్రాలు బహుకరించ జరిగింది. ఈ సందర్భంగా సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి విదార్థిని కూడా ఆత్మ సంరక్షణ నైపుణ్యాల అవశ్యకతను తెలియజేశారు. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ గా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నరసింహ రావు , ట్రైనర్ గా రవి మాస్టర్ సరిత మాస్టర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పీఎం ఉష కో ఆర్డినేటర్, వీ కే దీనదయాల్, రుద్రమదేవి, సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ నర్రా లక్ష్మీ , అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!