EPAPER
Thursday, March 12, 2026
Google search engine

స్వచ్ఛరథం వాహనాలకు జెండా ఊపి ప్రారంభం పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణమే లక్ష్యం పి ఎం కె ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు

📰 Generate e-Paper Clip

రామకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి25:

కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో “స్వచ్ఛరథం” వాహనాల ను పీకే ఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతిగ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే లక్ష్యంతో  “స్వచ్ఛరథం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాలకు స్వచ్ఛరథం వాహనం వచ్చిన సమయంలో ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే, వాటి బదులుగా కూరగాయలు,వంట సరుకులు అందజేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణం సాధిద్దా మని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని పంద్యా లమడుగు నుండి పల్లి కుప్పం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!