EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

సోషల్ మీడియా సేవలకు లోకేష్ ప్రశంసలు

📰 Generate e-Paper Clip

ఏలూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 02:

 

తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా వేదికలను సమర్థంగా వినియోగిస్తున్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మండవల్లికి చెందిన గుడివాడ విజయ గణేష్ కుమార్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక ప్రశంసలు అందజేశారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు గణేష్ కుమార్‌ను అభినందిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రశంసాపత్రంతో పాటు పార్టీ షర్ట్ పంపించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ (చంటి) చేతుల మీదుగా గణేష్ కుమార్ ప్రశంసాపత్రం, పార్టీ షర్ట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గణేష్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయ మన్నారు. కైకలూరు నియోజకవర్గ పరిధిలో సోషల్ మీడియా వేదికలతో పాటు మై టీడీపీ యాప్ ద్వారా పార్టీ సమాచారం ప్రజలకు చేరవేయడంలో గణేష్ కుమార్ ముందంజలో ఉన్నారని తెలిపారు. అలాగే పార్టీపై వస్తున్న విమర్శలు, ప్రతిపక్షాల ఆరోపణలకు సమర్థవంతంగా స్పందిస్తూ పార్టీ భావజాలాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు. ఇదే ఉత్సాహంతో, అంకితభావంతో పార్టీ కోసం మరింతగా పనిచేసి మంచి గుర్తింపు తీసుకురావాలని జిల్లా అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గణేష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!