EPAPER
Sunday, October 18, 2026
Google search engine

సైకిల్‌పై ఆధ్యాత్మిక యాత్ర 6 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన శ్రీకాళహస్తి యువకుడు

📰 Generate e-Paper Clip

 

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 15:

 

శ్రీకాళహస్తి: ఆధ్యాత్మికతపై ఆసక్తితో శ్రీకాళహస్తికి చెందిన 22 ఏళ్ల కె.విద్యాసాగర్ సైకిల్‌పై దేశంలోని పలుపుణ్యక్షేత్రాల ను సందర్శిస్తూ స్ఫూర్తిదాయక యాత్ర కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో 6వేల కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణించి అనేక ఆలయాల ను దర్శించుకున్నాడు. ఎలాంటి ప్రత్యేక వాహనం, బృందం, సౌకర్యాలు లేకుండా సొంత ఖర్చులతోనే యాత్ర కొనసా గిస్తున్నాడు. రాత్రివేళ సురక్షిత ప్రాంతాల్లో టెంట్ ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ, మరుసటి రోజు తిరిగి ప్రయాణం ప్రారం భిస్తున్నాడు. ఎండ, వర్షం, అలసట వంటి సవాళ్లు ఎదురైనా సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. యాత్రలో వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశిష్టతలను తెలుసుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత పొందుతున్నానని విద్యాసాగర్ తెలిపారు. యువతలో ఆధ్యాత్మికతతో పాటు సాహసం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెంచడమే తన యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!