EPAPER
Saturday, April 18, 2026
Google search engine

సిటీలో ఆపరేషన్ “వజ్రప్రహార్” – చెంగాంబక్కం గ్రామంలో కార్డెన్ సెర్చ్

📰 Generate e-Paper Clip

 

సిటీ,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 10:

 

తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు చేపట్టిన “వజ్రప్రహార్” కార్యక్రమంలో భాగంగా శ్రీ సిటీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారి ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శ్రీ సిటీ ఉప పోలీసు అధికారి బి.వి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది శుక్రవారం ఉదయం చెంగాంబక్కం గ్రామంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 మంది వ్యక్తులను, 10 వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచి వారి వివరాలు సేకరించారు. అనంతరం గ్రామస్థుల తో సమావేశమైన ఉప పోలీసు అధికారి బి.వి.శ్రీనివాసులు గంజాయి వినియోగం,రోడ్డు భద్రత, మహిళల పై జరిగే నేరాలు,బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా నిఘా ఉంచుతున్నారని, అలాంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!