EPAPER
Sunday, March 8, 2026
Google search engine

శ్రీకాళహస్తి దేవస్థానం కొత్త ఈవోగా బి.కే. వెంకటేశులు బాధ్యతలు

📰 Generate e-Paper Clip

 

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి

 

 

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.కే. వెంకటేశులు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో బి.కే. వెంకటేశులు దేవస్థానం ఈవోగా అధికారికంగా చార్జి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు నాగరాజు, రాఘవయ్య, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ హేమామాలిని, ఏఈఓ లోకేష్ బాబు, పర్యవేక్షకులు నాగభూషణం, రవి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, పురోహితులు అర్ధగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!