EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

📰 Generate e-Paper Clip

 

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 27:

 

 

 

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పట్టణంలోని నెహ్రూవీధిలో వెలసివున్న రామమందిరం లో శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా నిర్వహించారు. మూలవిరాట్టుకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం నెహ్రూ వీధి యందు మండపం లో సీతాసమేత రాములువారి ఉత్సవమూర్తులను కొలువు దీర్చి విశేష అలంకారాలు చేశారు. వేద పండితులు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వేడుకగా వైభవంగా జరిపారు. జానకిరాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆనందంతో పరవశించారు. కల్యాణోత్సవం అనంతరం మహిళా భక్తులకు సమకూర్చిన సౌభాగ్య వాయనంను దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశులు, దంపతులు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్‌ , దేవస్థానం ధర్మకర్తలి సభ్యురాలు కోలా విశాలాక్షి, బోర్డు సభ్యులు, దేవస్థానం అర్చకులు వేద పండితులు ,దేవస్థానంఅధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!