కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 15:
కుప్పం పట్టణంలోని బీసీఎన్ విద్యాసంస్థలు కుప్పం పబ్లిక్ స్కూల్ 23వ వార్షికోత్సవం, కుప్పం జూనియర్ కాలేజ్ 18వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాయి. సంక్రాంతి సమయంలో జరిగిన ఈ కార్యక్రమానికి శంకర వరప్రసాద్ సినిమాల్లో నటించిన వెండితెర బాల నటుడు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ అలియాస్ బుల్లి రాజు ప్రధాన అతిథిగా విచ్చేశాడు.బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బి సి నాగరాజు, కుప్పం పబ్లిక్ స్కూల్, కుప్పం జూనియర్ కాలేజ్ చైర్మన్ ఎన్ శాంత, బీసీఎన్ గ్రూప్ వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజు, సెక్రటరీ సాగర్ రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అందించిన దేశభక్తి ఆటలు, పాటలు, నృత్యాలు అందరినీ అలరించాయి.కుప్పం పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దమయంతి, ఉప ప్రధానోపాధ్యాయురాలు ప్రియ, కుప్పం జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సుప్రియ, ఉపాధ్యాయులు, పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.


Recent Comments